సీమలో మీరు రక్తం పారిస్తే.. మేం నీళ్ళు పారిస్తున్నాం
YSRCP MLA Thopudurthi Prakash Reddy Fire On Chandrababu. సీమలో మీరు రక్తం పారిస్తే.. మేం నీళ్ళు పారిస్తున్నామని అనంతపురం
By Medi Samrat Published on 21 May 2022 11:54 AM GMTసీమలో మీరు రక్తం పారిస్తే.. మేం నీళ్ళు పారిస్తున్నామని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. చంద్రబాబుది "వాగుడే.. వాగుడు" కార్యక్రమం అని ఎద్దేవా చేసిన ఆయన.. ఎలిమినేట్ చేస్తానన్న బాబు రక్త చరిత్ర ఏమిటో ప్రజలకు అర్థమైందని విమర్శించారు. సీమలో ఫ్యాక్షన్ లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ పరిపాలనలో సీమ ఊపిరి పీల్చుకుందని ప్రకాశ్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు సామాజిక, ఆర్థిక ఉన్మాది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. అధికారం కోసం ఇంతగా దిగజారాలా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. మీరంతా కట్టకట్టుకుని వస్తామంటున్నారంటేనే.. జగన్ అద్భుతమైన పరిపాలన చేస్తున్నారని అర్థమవుతుందని అన్నారు. సీఎం విమాన ప్రయాణంపైనా అవాకులు, చెవాకులు ఏంటని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది చంద్రబాబేనని ప్రకాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా.. గత మూడేళ్ళలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి మేం తీసుకువెళుతుంటే.. దాన్ని కౌంటర్ చేయలేక, రాయలసీమ జిల్లాలో రక్తపాతం పారించకపోతే, ఫ్యాక్షన్ ను బతికించకపోతే నాలుగు సీట్లు కూడా రావు అన్నట్టుగా.. ఒక సామాజిక ఉన్మాదిగా, ఆర్థిక ఉన్మాదిగా ప్రవర్తిస్తూ చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టి వెళ్ళారని పైర్ అయ్యారు. రాయలసీమ ప్రాంతంలో ప్రజలు చంద్రబాబు మాటలు విని రెచ్చిపోవాలి, ప్రజలను రెండు వర్గాలుగా విభజిస్తే.. ఆ విధంగానైనా నాలుగు ఓట్లు సంపాదించవచ్చు.. అన్న దుర్బుద్ధితో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చంద్రబాబు మాట్లాడటం దిగజారుడు రాజకీయం కాక మరేమిటి.? అని ప్రశ్నించారు.
చంద్రబాబు రాప్తాడులో పెట్టిన మీటింగ్ కు మా మండల స్థాయి మీటింగ్ అంత స్థాయి లేదని అన్నారు. టీడీపీ వెంట జనం ఎవరూ లేరని... జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి చేసినవారు., నీరు-చెట్టు పేరుతో డబ్బులు తిన్నవాళ్ళే మీతో మిగిలారని విమర్శించారు. రోడ్ షోలు అంటూ చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నారు.. చేతనైతే మీరు కూడా 2014-19 మధ్య ప్రజలకు మీరు ఏం చేశారో.. గడప గడపకు వెళ్ళి చెప్పండని సవాల్ విసిరారు. డీబీటీ ద్వారా ప్రజలకు ఏం ఇచ్చారో, సామాజిక న్యాయం ఏం చేశారో చెప్పండని అన్నారు. చేప పిల్ల నీళ్ళల్లో ఉంటేనే బతుకుంది అన్నట్టు.. అధికారంలో లేకపోతే బతకలేం అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో తయారయ్యారని విమర్శించారు.