కబడ్డీ కోర్టులో రచ్చ చేసిన రోజా
YSRCP MLA Roja Played Kabaddi Along with her Husband Selvamani. ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అటు బుల్లితెరపైనా.. ఇటు పొలిటికల్ గా కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు
By Medi Samrat
ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అటు బుల్లితెరపైనా.. ఇటు పొలిటికల్ గా కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన భర్త, పలువురు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఆమెను ఔట్ చేయడానికి భర్త సెల్వమణి ప్రయత్నించారు కూడానూ..! ఏపీలో నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అతిథిగా అక్కడకు రోజా వెళ్లారు. టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక వేశారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త సెల్వమణి కూడా పాల్గొన్నారు. రోజా కబడ్డీ ఆటలో కూతకు వచ్చిన సమయంలో ఆమెను ఔట్ చేయడానికి అవతలి జట్టులో ఉన్న సెల్వమణి ప్రయత్నించారు. ఆయన కూడా కూతకు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయలేకపోయారు. సరదాగా సాగిన ఈ మ్యాచ్ ను అందరూ ఆసక్తికరంగా చూసారు.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పారిశుధ్యం పట్ల ప్రజల్లో బాధ్యత పెంపొందించడం కోసమే చెత్త మీద పన్ను విధించారని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2కోట్ల 36లక్షల రూపాయల బడ్జెట్‌తో క్లీన్ పుత్తూరుకు శ్రీకారం చుట్టారని అన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉచితం అయితే బాధ్యతగా ఉండరనే ఉద్దేశంతోనే రోజుకో రూపాయి వంతున చెత్త పన్ను విధించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వం సంపాదించేదేమీ లేదన్నారు. అందరి ఇళ్లు, వీధి, ఊరు శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు.