నిస్వార్థంగా సేవ చేస్తున్న మీలాంటి వారు పోటీ చేయాలని సీఎం చెప్పారు : పేర్ని నాని

మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌ను సీఎం జగన్ నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

By Medi Samrat  Published on  8 March 2024 5:51 PM IST
నిస్వార్థంగా సేవ చేస్తున్న మీలాంటి వారు పోటీ చేయాలని సీఎం చెప్పారు : పేర్ని నాని

మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌ను సీఎం జగన్ నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. సింహాద్రి చంద్రశేఖ‌ర్ తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని వెల్ల‌డించారు. మచిలీపట్నంతో సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌కు వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. 35 ఏళ్లుగా అంకాలజీ వైద్యుడిగా ఆయన సేవలు అందిస్తున్నారని వెల్ల‌డించారు. రాజకీయ బేధాలు వైరుధ్యాలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారని.. మచిలీపట్నం పార్లమెంట్ ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారని అన్నారు.

మాకు ఉత్సాహం వచ్చేలా సీఎం చంద్ర శేఖ‌ర్‌ను నియమించారని పేర్కొన్నారు. సమాజంలో సమకాలీన అంశాల పట్ల అవగాహన ఉన్న చంద్ర శేఖ‌ర్‌ను పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం మాకు ఆనందంగా ఉందిన్నారు. పదవుల కోసం గోడలు దూకే వాళ్ళు ఉన్నారని.. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మీ లాంటి వారు పోటీ చేయాలని సీఎం చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు.

Next Story