చంద్రబాబు అర్థరాత్రి చర్చలపై పేర్ని నాని కామెంట్లు

బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు నాయుడు పాకులాడుతూ ఉన్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  9 Feb 2024 3:53 PM IST
చంద్రబాబు అర్థరాత్రి చర్చలపై పేర్ని నాని కామెంట్లు

బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు నాయుడు పాకులాడుతూ ఉన్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బీజేపీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీ నేతలను సంప్రదిస్తూ ఉన్నారంటూ దుయ్యబట్టారు. ఇక బీజేపీతో చంద్రబాబు చర్చలపై పేర్ని నాని స్పందించారు. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటని ప్రశ్నించారు. 2014లో బీజేపీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపారని.. 2019 వరకు కలిసి ఉండి చివర్లో మోసం చేసిందని బీజేపీని తిట్టారని అన్నారు పేర్ని నాని. ప్రధాని మోదీకి భార్యాపిల్లలు లేరని.. కుటుంబం లేని వ్యక్తి నాతో పోటీనా అని చంద్రబాబు విమర్శించారని తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కరిగా జగన్ పై గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏ న్యాయం చేసిందో చంద్రబాబు చెప్పాలని.. బీజీపీ, టీడీపీ చేసిన పాపాలకు ప్రజలకు క్షమాపణ చెబుతారా అని పేర్ని నాని ప్రశ్నించారు.

బీజేపీ మీద కూడా పేర్ని నాని మండిపడ్డారు. బీజేపీ ఏపీకి ఏమి న్యాయం చేసిందో చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చిందా.. రైల్వే జోన్ ఇచ్చిందా అని కడిగేశారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఈరోజుకీ నయాపైసా ఇవ్వలేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడు. ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకోవాలని చూస్తున్నారని పేర్ని నాని విమర్శించారు.

Next Story