2024, 2029 ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా : కొడాలి నాని

YSRCP MLA Kodali Nani Slams Chandrababu. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ‌ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు

By Medi Samrat  Published on  28 Jun 2022 9:14 PM IST
2024, 2029 ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ‌ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. గుడివాడ నియోజకవర్గంలో నిర్వ‌హించిన‌ వైసీపీ ప్లీనరీ సమావేశాలలో నాని మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు. చంద్రబాబు నన్ను ఓడించడం కాదు.. 2024లో కుప్పంలో గెలవాలని స‌వాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును, ఆయ‌న‌ను నమ్ముకున్న దత్తపుత్రుడిని కూడా తుక్కుతుక్కు కింద ఓడిస్తామ‌ని నాని అన్నారు. ఎన్టీఆర్ వారసుడు మాదిరిగా జగన్ పని చేస్తున్నాడని కొడాలి నాని అన్నారు.

౨ గుడివాడ‌లో 2024, 2029 ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా.. గుడివాడ‌లోనే చస్తానని అన్నారు. పుట్టిన ఊరు వదిలి పారిపోయిన చంద్రబాబు ఓ నాయకుడా అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను చంపిన చంద్రబాబు నిమ్మకూరులో బసచేస్తే ఆయన ఆత్మ క్షోబిస్తుందని అన్నారు. కుటుంబ పెద్ద లాంటి వైఎస్ఆర్ లేకపోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలైందని అన్నారు. జగన్‌కు అడ్డంగా నిలబడ్డ తమను దాటుకొని చంద్రబాబు, దత్తపుత్రుడు ముందుకు వెళ్లాలని స‌వాల్ విసిరారు. తిరుపతి ప్రజల చిత్కారానికి గురయ్యామన్న భయంతోనే ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు.











Next Story