గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగన్‌ చెబుతారు : కొడాలి నాని

గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.

By Medi Samrat  Published on  19 Feb 2024 1:45 PM GMT
గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగన్‌ చెబుతారు : కొడాలి నాని

గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు.. రామోజీ ,రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదని అన్నారు. సీఎం జగన్ మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత ఏడు లిస్టుల్లో ప్రకటించారు. రాష్ట్రంలో ఇంకా 105 ప్రకటించని సీట్లు ఉన్నాయన్నారు. వినేవాళ్లు తెలుగు తమ్ముల్లైతే... చెప్పేవాడు చంద్రబాబులా.. ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని ఎద్దేవా చేశారు. సీటు ఎవరికో అధిష్టానమో, మా పార్టీ నాయకులో చెబుతారు.. మధ్యలో ఉన్న పకోడీ గాళ్ళకేం సంబంధమ‌న్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు సీఎం జగన్ సీటి ఇచ్చాడు.. బ్రోకర్ పనులు పైరవీలు చేస్తేనో.. డబ్బుందనో.. ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లివ్వరన్నారు. సీఎం జగన్ లా చంద్రబాబు మగాడైతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలన్నారు. గన్నవరం నుండి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడని చెప్పారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీకు సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

టీడీపీలో అయితే వారి మీడియా ఛానల్సే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తాయన్నారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు.. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.. అవి అర్థవంతంగా ఉండాలిగా అన్నారు. దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి.. అదెలాగో చేతకాదు.. ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా.? అని ప్ర‌శ్నించారు. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు X నుండి ఛాలెంజ్ లు చేస్తున్నాడు. సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పెర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటాడని అన్నారు. చంద్రబాబు సీఎం జగన్ ను కాకుండా, తనలా మాజీలుగా ఉండే వాళ్లపై X లో ఛాలెంజ్‌లు చేసుకోవాలని సూచించారు.

Next Story