ఆ రోజు తర్వాత చంద్రబాబును తలుచుకునేవారే ఉండ‌రు : కొడాలి నాని

జూన్‌ 4 తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తలుచుకునే వారెవరూ ఉండరని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు

By Medi Samrat  Published on  27 March 2024 4:00 PM GMT
ఆ రోజు తర్వాత చంద్రబాబును తలుచుకునేవారే ఉండ‌రు : కొడాలి నాని

జూన్‌ 4 తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తలుచుకునే వారెవరూ ఉండరని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు. మరోసారి చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏమి చేయడానికైనా సిద్ధమేనని, గాడిద కాళ్లైనా పట్టుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని అన్నారు.

గుడివాడలో అయిదవసారి తానే గెలవబోతున్నానని.. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని అన్నారు. ఎంతమంది వచ్చినా వైఎస్సార్‌సీపీ తరపున హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌కు ఇదే నా సవాల్‌.. చంద్రబాబు, లోకేష్ గుడివాడలో తన పై పోటీ చేసి గెలవాలన్నారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు. వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారన్నారు. చంద్రబాబు ఎంత 420నో చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసన్నారు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడని అన్నారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే. గుడివాడలో గెలిచేది తానేనని అన్నారు కొడాలి నాని. గుడివాడ ఒకటవ వార్డు నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాగవరప్పాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.

Next Story