వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..

చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని వైసీపీ నేత‌ సజ్జల రామ‌కృష్ణా రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  8 March 2024 1:53 PM GMT
వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..

చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని వైసీపీ నేత‌ సజ్జల రామ‌కృష్ణా రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఒక క్లాసికల్‌ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్లీ రుజువైంది. అందుకు 20 ఏళ్ల క్రిత చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోవటమే నేటి ఉదాహరణ అన్నారు. ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు. 850 ఎకరాల‌ స్థలాలు ఇచ్చేశారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారని అన్నారు.

లక్ష కోట్ల రూపాయల ప్రాపర్టీ కైవసానికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారన్నారు. అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు. వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు.. లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారన్నారు. అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారన్నారు. చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు. దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారని ఆరోపించారు. రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు. అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు.. అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్‌ని బయటపెడితే.. ఇప్పుడు చంద్రబాబు అమరావతి స్కామ్‌ని సీఎం జగన్‌ బయటపెట్టారని అన్నారు.

Next Story