పవన్ కళ్యాణ్ మీ నటన సినిమాల్లో చూపించండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించాలని.. రాజకీయాల్లో కాదని అన్నారు

By Medi Samrat  Published on  6 May 2024 10:18 AM GMT
పవన్ కళ్యాణ్ మీ నటన సినిమాల్లో చూపించండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించాలని.. రాజకీయాల్లో కాదని అన్నారు. పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదన్నారు. నేను ఏనాడూ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ గురించి మాట్లాడలేదని.. ఇంట్లో ఉన్న నన్ను పవన్‌ కళ్యాణ్ రోడ్డు మీదకు లాగాడన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి నా కుటుంబంలో పవన్ కళ్యాణ్ చిచ్చుపెట్టాడని ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడన్నారు.

నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త, మామ వీలైతే ఆమెను టీవీ డిబేట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని కోరుతున్నానన్నారు. తన కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేదన్నారు ముద్రగడ పద్మనాభం.

Next Story