మరో కీలక వైసీపీ నేత అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయగా.. ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on  5 Sept 2024 8:11 PM IST
మరో కీలక వైసీపీ నేత అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయగా.. ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నందిగం సురేశ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Next Story