వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక

బొత్స సత్యనారాయణ బ్రెయిన్ లక్షణాలతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరారు.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 2:56 PM IST

Botsa Satyanarayana, YSRCP, AndhraPradesh, Hyderabad, Brain Stroke

వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ లక్షణాలతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అమరావతిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.

గతంలో కూడా ఆయన పలుమార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గతేడాది జూన్‌లో విజయనగరంలో జరిగిన ఒక నిరసన ర్యాలీలో ఆయన స్పృహ తప్పి పడిపోగా, 2013లో మెదడులో రక్తము గడ్డకట్టిన సమస్యకు హైదరాబాద్‌లోనే చికిత్స పొంది కోలుకున్నారు. సీనియర్ నేత అయిన బొత్స త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.

Next Story