ముసుగు వేసి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది: అంబటి రాంబాబు

వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌ చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు

By Medi Samrat  Published on  12 Nov 2024 2:00 PM GMT
ముసుగు వేసి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది: అంబటి రాంబాబు

వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌ చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నేతలను అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్ పేరు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారన్నారు అంబటి రాంబాబు.

సోషల్‌ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్ళం హరికృష్ణ రెడ్డితో పాటు పానుగంటి చైతన్యను వైసీపీ నేతలు పరామర్శించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దని అంబటి రాంబాబు కోరారు. చిలకలూరిపేట సుధారాణి దంపతులను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌లో కొట్టి, కోర్టులో ప్రవేశ పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సోషల్ మీడియాలో చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు అంబటి రాంబాబు. వాటిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Next Story