ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీలో భారీగా సీట్లకు సంబంధించిన ప్రక్షాళన జరుగుతూ ఉంది. దీంతో పలువురు నేతలు వైసీపీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి డా.సంజీవ్‌కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ రావడం కష్టమేనని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమయ్యారు. కర్నూల్ ఎంపీ టికెట్‌ను మంత్రి జయరాంకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతూ ఉండడంతో మనస్తాపం చెందిన సంజీవ్ కుమార్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన రెండు రోజుల్లో లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
సీఎం జగన్‌ను కలవడానికి పోన్ చేస్తే ఎవరూ రిసీవ్ చేసుకోలేదని ఎంపీ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తామంటారు కానీ.. అది చేతల్లో ఉండదని విమర్శించారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని ఆరోపించారు.