నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తానని వైసీపీ నేత, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి.. ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. అబద్ధపు వాగ్ధానాలు చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాటు అని అన్నారు. పామర్రు నియోజకవర్గంలో గాని.. రాష్ట్రంలో గాని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ఎప్పుడూ నిజం చేయదన్నారు.
ప్రజల నుంచి వైసీపీకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనే దానిపై విశ్లేషించుకుంటామన్నారు. పరిపాలనలో ఏ విధమైన లోపాలు జరిగాయి.. ప్రజలు ఈ విధంగా ఎందుకు తీర్పు ఇచ్చారననే దానిపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి దీనిపై అధ్యయనం చేస్తామన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవలు కృషి చేస్తామన్నారు. పామర్రు ఓటమికి నాదే బాధ్యత. పామర్రులో నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వర్ల కుమార్ రాజా కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. పామర్రు నియోజకవర్గానికి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటునట్లు తెలిపారు.