విశాఖపట్నంలో వైసీపీకి షాక్

విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు.

By Medi Samrat  Published on  21 July 2024 7:53 PM IST
విశాఖపట్నంలో వైసీపీకి షాక్

విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు. కార్పొరేటర్లు గోవింద్, కంపా హనూక్, అప్పారావు, నరసింహపాత్రుడు, అప్పలరత్నం, రాజారామారావు, వరలక్ష్మి టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్లకు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు.

పార్టీ ఫిరాయిస్తున్న కార్పొరేట‌ర్లను బుజ్జగించేందుకు మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ రంగంలోకి దిగినా.. ఆయన ప్రయ‌త్నాలు ఫ‌లించ‌లేదని తెలుస్తోంది. జీవీఎంసీ ప‌రిధిలో 98 వార్డులున్నాయి. 2021లో జ‌రిగిన జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీ 58 వార్డుల‌ను గెలుచుకుని మేయ‌ర్ పీఠాన్ని సాధించుకుంది. టీడీపీ 30 వార్డుల‌ను గెలుచుకుని ప్రతిప‌క్షంలో ఉంది. జ‌న‌సేన మూడు వార్డుల‌ను గెలుచుకోగా, సీపీఎం, సీపీఐ, బీజేపీలు చెరొక్క వార్డును గెలుపొందాయి. అలాగే నాలుగు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇప్పుడు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి ప్రయత్నాలు చేస్తోంది.

Next Story