సోమవారం ఏలూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని గణపవరంలో వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కార్యక్రమం నాలుగో ఏడాది మొదటి విడత నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం రైతుల బ్యాంకు ఖాతాలలో జమచేస్తుంది ప్రభుత్వం. నాలుగో ఏడాది మొదటి విడతగా మేలో ఇచ్చే రూ.7,500లకు గానూ రూ.5,500లను సోమవారం నాడు ఏలూరు జిల్లా గణపవరంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు సీఎం వైఎస్ జగన్.
అలాగే.. ఈ నెల 31న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్ నిధులు మరో రూ.రెండు వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో మొత్తంగా నెలాఖరు నాటికి ..50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున.. దాదాపు రూ.3,758 కోట్లు జమ కానున్నాయి.