నేడు వైఎస్సార్‌ చేయూత రెండో విడత పంపిణీ

YSR Cheyutha Second Phase. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం) వర్చువల్‌గా రెండో విడత

By Medi Samrat
Published on : 22 Jun 2021 8:01 AM IST

నేడు వైఎస్సార్‌ చేయూత రెండో విడత పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు వర్చువల్‌గా రెండో విడత వైఎస్సార్‌ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప‌థ‌కం కింద‌ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేయనుంది. ఇక ఈ పథకం ద్వారా రెండేళ్లలో లబ్ధిదారులకు రూ.8,943.52 కోట్ల సాయం అందింది. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు ప్రభుత్వం ఏటా రూ.18,500.. నాలుగేళ్లలో రూ.75వేలు సాయం అందించనుంది.


ఎంచుకున్న వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు ఏర్పాటు చేయిస్తోంది. అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే 78వేల మందికి కిరాణా షాపులు పెట్టించింది. 1,90,517 మందికి గేదెలు, ఆవులు, మేకలు ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లీటర్‌ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు అందిస్తోంది. కిరణా షాపుల ద్వారా ఒక్కో మహిళకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది.


Next Story