అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్ర‌క‌టించిన‌ వైసీపీ అధిష్టానం

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు ప్రకరించింది

By Medi Samrat  Published on  26 March 2024 8:00 PM IST
అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్ర‌క‌టించిన‌ వైసీపీ అధిష్టానం

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు ప్రకరించింది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ.. అనకాపల్లి ఎంపీ సీటును మాత్రమే పెండింగ్‌లో ఉంచింది. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాలనాయుడిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి నిలుపుతున్నారు. మాడుగుల స్థానానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ.

ఇక ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. 27వ తేదీ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది.

Next Story