వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు

YS Vivekananda Reddy murder case investigation. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు ప్రారంభించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి

By Medi Samrat  Published on  28 Jan 2023 5:13 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు ప్రారంభించింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుకు SC/01/2023 నెంబర్ ను కేటాయించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్లారు. విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మను వైఎస్ అవినాశ్ కలిశారు. లోటస్ పాండ్ కు వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు.



Next Story