వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్

YS Vivekananda Reddy Murder Case. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్

By Medi Samrat  Published on  13 Feb 2023 4:00 PM GMT
వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 16న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ ఏ2 నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ ఈనెల 6న పిల్ వేశాడు. దీనిపై జస్టిస్ సీహెచ్ సుమలత విచారించనున్నారు. ఈ కేసు విచారణను ఇటీవలే సుప్రీంకోర్టు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు విచారిస్తుంది. ఈ నెల 10వ తేదీన తొలిసారిగా ఈ కేసు హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు విచారించింది. గతంలో నిందితులంతా కడప జైలులో ఉండేవారు. అయితే ఈ కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారిస్తున్నందున నిందితులను హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.


Next Story