గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

By -  Knakam Karthik
Published on : 6 March 2026 5:30 PM IST

Andrapradesh, YS Sharmila, AP Politics, CM Chandrababu, MGNREGA, Congress, Drinking Water Crisis

గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గం కవతవరం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం సుపరిపాలన అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

చంద్రబాబు చెబుతున్న వికాసం, అభివృద్ధి అంతా డొల్ల అని, సంక్షేమం బూటకమని ధ్వజమెత్తారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ఉన్నవాటిని తొలగిస్తున్నారని, ఏ ఒక్క పథకం గ్రామానికి అందడం లేదని ప్రజలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. అక్కడికక్కడే కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

Next Story