ఆ వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారు : ష‌ర్మిల

సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ విష‌య‌మై వైఎస్ జ‌గ‌న్‌పై ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  22 Nov 2024 10:06 AM GMT
ఆ వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారు : ష‌ర్మిల

సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ విష‌య‌మై వైఎస్ జ‌గ‌న్‌పై ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు.. మీకు ఇలా జరిగిందని తెలిసుంటే.. మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు.. అప్పుడు గాడిదలు కాసారా.? ఎంక్వైరీ ఎందుకు చేయలేదు.? అని నిప్పులు చెరిగారు. ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా.? అని ప్ర‌శ్నించారు. మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు.. జగన్ ఈ ప్రాపగాండా చేయ‌నిచ్చారు అని ఆరోపించారు. నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారన్నారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ చార్జ్‌షీట్‌లో పెడతారు.. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారన్నారు. జగన్ మోదీకి దత్త పుత్రుడు.. ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా.? అని అడిగారు.

జగన్ బాటలో చంద్రబాబు నడవోద్దని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుందని.. ఇక మీద అదానీ కి ప్రాజెక్ట్స్ ఇవ్వొద్దని వైఎస్ ష‌ర్మిల అన్నారు. మోదీ, అదానీ వేర్వేరు కాదు.. మోదీ, అదానీకి రక్షణ కల్పిస్తున్నారు.. అదానీ మోదీకి డబ్బులు ఇస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉంది. అదానీపై అమెరికాలో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినా.. ఇక్కడ ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది.. మోదీ, అదానీల బంధం.. పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడని ఆరోప‌ణ‌లు చేశారు. ఇన్ని డబ్బులు సంపాదించడం ఎలా సాధ్యం.? మోదీ రక్షణతోనే అదానీపై ఎటువంటి చర్యలు లేవు అన్నారు. అదానీ వ్యవహారం మోదీకి, దేశానికి అవమానంగా అభివ‌ర్ణించారు. మోదీ కాంగ్రెస్ ఒక్క ప్రశ్నకు అయినా సమాధానం చెప్పాలన్నారు.

ష‌ర్మిల వ్యాఖ్య‌ల ప‌ట్ల బాల‌కృష్ణ స్పందించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ష‌ర్మిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుస‌న్నారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు.

Next Story