వారి చేతుల్లోనే జగన్ రిమోట్ కంట్రోల్: వైఎస్ షర్మిల
తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 30 April 2024 1:28 PM ISTవారి చేతుల్లోనే జగన్ రిమోట్ కంట్రోల్: వైఎస్ షర్మిల
తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వారిద్దరి పేర్లూ Bతోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ బిడ్డగా తాను ఓడిపోతే నేరం గెలిచినట్లేనని అన్నారు. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అన్నారు. వైఎస్‌ఆర్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చింది కాంగ్రెస్సేనని వైసీపీ ఆరోపిస్తోందని, ఆయన పేరు అసలు ఎఫ్‌ఐఆర్‌లోనే లేదని షర్మిల మండిపడ్డారు.
చాపర్ ప్రమాదంలో ఆరోపణలు వచ్చిన వారికే సీఎం జగన్ ఎంపీ పదవులు ఇచ్చాడని అన్నారు. తాను ఓడిపోతా అని బాధ ఉంటే.. అవినాష్ రెడ్డిని తప్పించాలన్నారు. చెల్లి అని ప్రేమ ఉంటే.. మీ(సీఎం జగన్) బాధ నిజమే అయితే.. అవినాష్ తో విత్ డ్రా చేయించాలన్నారు. ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదని, విత్ డ్రా చేయించేందుకు సమయం ఉందని అన్నారు. ఎందుకీ ముఖస్తుతి మాటలని షర్మిల మండిపడ్డారు.
''ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి అప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? ఆ ఎన్నికల్లో వివేకాను ఓడించింది ఈ అవినాష్ రెడ్డి.. ఈ భాస్కర్ రెడ్డి కాదా ? అలాంటి వాళ్లకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోతాను అని నమ్మకం మీకు ఉంటే ఎందుకు భయం? మీకు భయం లేకపోతే వైఎస్ కుటుంబాన్ని మొత్తం ఎందుకు దించారు ? ఇంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు ? వైఎస్‌ఆర్ బిడ్డ, మీ చెల్లి అని చూడకుండా.. నా గురించి.. నా పుట్టుక గురించి.. నా పేరు గురించి ఎందుకు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు ? కుక్క బిస్కెట్లు పడేసి సోషల్ మీడియాలో ఎందుకు కథనాలు అల్లుతున్నారు?'' అని సీఎం జగన్‌ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.