వైసీపీ అలా అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్.. షర్మిల కౌంటర్
జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని వైసీపీ అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 30 Oct 2024 10:16 AM GMTజగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని వైసీపీ అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనన్నారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదు.. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదన్నారు. 2016 లో ఈడీ, భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU మీద సంతకం చేశారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని.? 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన, సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు.? అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని.? అపుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా.? 2021 లో జగన్, భారతి రెడ్డి తమ షేర్స్ పై సంతకం చేసి.. విజయమ్మకి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు.. ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని..? ప్రశ్నలు సంధించారు.
షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబంధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారు.. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. NCLT లో కేసు ఉంది కాబట్టి.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని.. కొడుకు బెయిల్ కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మకు తెలుసు.. విజయమ్మ లేఖ తాను రాయకపోతే.. ఆ లేఖతో సంబంధం లేదని.. అది నేను రాయలేదని.. స్వయంగా లేఖను ఖండించే వారు కదా.? అని ప్రశ్నించారు.