ఆదానీ.. మోదీ గ్రూప్, ఆదానీ.. మోదీ బినామీ : షర్మిల
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందని.. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 13 Aug 2024 11:45 AM GMTకాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందని.. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు. ఇటీవల పార్లమెంట్ లో బీజేపీ అనుసరించిన వైఖరి మీద చర్చ జరిగిందని తెలిపారు. సవివరంగా, ప్రజాస్వామ్య బద్దంగా అందరి అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. బీజేపీ మైనారిటీల మనోభావాలను దెబ్బ తీసిందని.. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వక్ఫ్ చట్ట సవరణ మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదన్నారు.
సెబీ, ఆదానీ అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చిందని తెలిపారు. సెబీని తన గుప్పెట్లో పెట్టుకొని ఆదానీ కాపాడుతున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేయబోతోందన్నారు. కులగణన అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ లెవనెత్తింది. అవినీతి రహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెప్తుంది. కానీ ఆదానీ- మోడీల అవినీతిని రాహుల్ గాంధీ ఎప్పుడో ఎండగట్టారని అన్నారు. ఆదానీ మోదీ గ్రూప్, ఆదానీ మోదీ బినామీ అని ఆరోపించారు. ఆదానీని కాపాడే విషయంలో మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతామన్నారు. క్షేత్రస్థాయిలోకి బీజేపీ అవినీతిని తీసుకెళ్లే కార్యాచరణ ఉండబోతుందన్నారు.