ఏఐ మీద పావు వంతు శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టండి..సీఎంకు షర్మిల హితవు
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By - Knakam Karthik |
ఏఐ మీద పావు వంతు శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టండి..సీఎంకు షర్మిల హితవు
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐ (AI) మీద పెట్టే శ్రద్ధలో పావు వంతైనా ప్రజారోగ్యం మరియు ఫుడ్ సేఫ్టీపై పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన 11 మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి సీఎం పూర్తి బాధ్యత వహించాలని మండిపడ్డారు.
రాష్ట్రంలో పాలు, నెయ్యి, మద్యం నుంచి ప్రభుత్వ వాగ్దానాల వరకు అన్నీ కల్తీ అయిపోయాయని షర్మిల విమర్శించారు. 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా వరలక్ష్మి డైరీ నడుస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైందని, పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలుపుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రజలకు ఆపద వస్తే బయటకు రారని విమర్శించారు. చనిపోయిన బాధితుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందించాలని, ఫుడ్ సేఫ్టీ సంస్థను తక్షణమే బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
AI మీద పెట్టే శ్రద్ధలో పావు వంతైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజారోగ్యం మీద పెట్టాలి. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను బలోపేతం చేయడంపై పెట్టాలి. జనాభా కనమని చెప్పడం కాదు..ఉన్న వాళ్లకు ప్రజారోగ్యంపై భద్రత కల్పించాలి. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో సంభవించిన 11 మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే.… pic.twitter.com/8FLffaOuGb
— YS Sharmila (@realyssharmila) March 9, 2026