సూపర్ సిక్స్ పై ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల
కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.
By Medi Samrat Published on 25 Sep 2024 9:12 AM GMTకాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా? అని షర్మిల ప్రశ్నించారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతోందని విమర్శించారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టామన్నారు వైఎస్ షర్మిల. పల్లెం, గరిటెతో నిరసన చేపట్టాలన్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడుకి వినపడాలన్నదే తమ ఉద్దేశ్యం అని అన్నారు. ఇది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు.. ఇది ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు, ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఏవీ లేవన్నారు షర్మిల. అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, 20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అటకెక్కినట్లె ఉందన్నారు.
రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ తో ఎందుకు కూటమి కట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తల్లికి వందనం పథకం అమలు లేదని, ఎంతమంది బిడ్డలు అంటే అందరికీ 15 వేలు ఇస్తాం అన్నారన్నారు. గత ప్రభుత్వం ఒక బిడ్డకు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదన్నారు వైఎస్ షర్మిల.