ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిలకు అధిష్టానం ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే కాంగ్రెస్‌లో వైఎలుస్సార్టీపీని విలీనం చేసిన షర్మిలకు కీలక బాధ్యత అప్పగిస్తారంటూ వార్తలు వెలువడ్డాయి. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సోమవారం పదవికి రాజీనామా చేయగా.. అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.