ఆ పెళ్ళికి సతీసమేతంగా హాజరైన వైఎస్ జగన్ దంపతులు

YS Jagan's couple attended the wedding. సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు

By Medi Samrat
Published on : 3 Dec 2022 5:34 PM IST

ఆ పెళ్ళికి సతీసమేతంగా హాజరైన వైఎస్ జగన్ దంపతులు

సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను సీఎం జగన్‌, భారతీరెడ్డి ఆశీర్వదించారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్‌ఎస్టేట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం పులివెందుల భాకరాపురం చేరుకున్నారు. కదిరి రోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీఎం జగన్ ను చూసి పలువురు ఆశ్చర్యపోయారు.


Next Story