ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన వైఎస్ జగన్

YS Jagan welcomed Prime Minister Narendra Modi. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు.

By Medi Samrat  Published on  4 July 2022 11:18 AM IST
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన వైఎస్ జగన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట నుంచి ఏపీ లోని గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళతారు. 11 గంటలకు ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్‌, సీఎం భీమవరం బయలుదేరారు.

అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభా వేదిక నుంచే వర్చువల్‌ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పిస్తారు.








Next Story