బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో కోర్టు తీర్పుపై స్పందించిన సీఎం జ‌గ‌న్‌

YS Jagan welcome court verdict in Ramya's murder case. బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును

By Medi Samrat  Published on  29 April 2022 1:27 PM GMT
బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో కోర్టు తీర్పుపై స్పందించిన సీఎం జ‌గ‌న్‌

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి దోషులను శిక్షించినందుకు పోలీసు శాఖకు అభినందనలు' అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గుంటూరులో గతేడాది ఆగస్టు 15న హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడింది.

ఇదిలావుంటే.. హత్య జరిగిన మరుసటి రోజే అప్పటి హోంమంత్రి సుచరిత రూ.10 లక్షలు రమ్య తల్లి జ్యోతికి అందజేశారు. మూడు నెలల పాటు కుటుంబానికి అవసరమైన నగదును అందజేశారు. ఈ నెల 20వ తేదీన రమ్య తల్లికి గుంటూరులో నవరత్నాలు-పెదళ్లందరికీ ఇల్లు పథకం కింద ఇంటిని మంజూరు చేశారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000, ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు అందించింది.

రమ్య సోదరి మౌనికకు సెప్టెంబర్ 16న రెవెన్యూ శాఖలో ఉద్యోగం లభించగా.. ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పించారు. బాధిత కుటుంబం కోరడంతో ప్రభుత్వం వారి స్వగ్రామమైన అమృతలూరు మండలంలో ఐదు గుంటల భూమిని రూ. 1,61,25,300 చెల్లించి రమ్య తల్లి పేరు మీద రిజిస్టర్ చేయించారు. రమ్య హత్య కేసులో ప్రభుత్వ తీరును జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్ ప్రశంసించారు. హత్యానంతరం గుంటూరుకు వచ్చిన కమిషన్ బృందం దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా ఏపీ ప్రభుత్వ తీరును కొనియాడింది.

Next Story