మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 15 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధిపతులను నియమించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోనమరెడ్డి సునీల్ నియమితులయ్యారు. రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు, రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి (ప్రైవేటు స్కూళ్లు), చంద్రశేఖరరెడ్డి (ప్రభుత్వ స్కూళ్లు)ని, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. ఎంవీఎస్ నాగిరెడ్డి-రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు. ఖాదర్‌బాషా రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడుగా కొనసాగుతారు. మనోహర్‌రెడ్డి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడుగా.. నారాయణమూర్తి రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడుగా బాధ్యతలను నిర్వర్తించనున్నారు.