రేపు సీఎం జగన్ నరసరావుపేట పర్యటన‌..

YS Jagan to visit Narasaraopet of Palnadu tomorrow. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా

By Medi Samrat  Published on  6 April 2022 1:06 PM IST
రేపు సీఎం జగన్ నరసరావుపేట పర్యటన‌..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. షెడ్యూల్‌లో భాగంగా ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు పీఎన్‌సీ కళాశాలలో కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉదయం 11.00 గంటలకు స్టేడియానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని అదే వేదికపై స్వచ్ఛంద సేవకులను సన్మానించి ప్రోత్సాహకాలు అందిస్తారు.

మధ్యాహ్నం 12.35 గంటలకు నరసరావుపేటలో బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. నరసరావుపేట పర్యటన అనంతరం మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత‌ రాజీనామా చేయాల్సిన మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారనే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. కొత్త మంత్రివర్గం ఏప్రిల్ 11న ప్రమాణ స్వీకారం చేయనుంద‌ని స‌మాచారం.










Next Story