విద్యుత్‌ శాఖపై సీఎం జ‌గ‌న్‌ సమీక్ష

YS Jagan reviews on Power sector. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్

By Medi Samrat  Published on  4 May 2022 12:25 PM GMT
విద్యుత్‌ శాఖపై సీఎం జ‌గ‌న్‌ సమీక్ష

బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ డిమాండ్-సరఫరా, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే విద్యుత్తును భారీగా కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చిలో రూ.1,123.74 కోట్లకు 1268.69 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో రూ.1,022.42 కోట్లకు 1047.78 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

డీబీటీ ద్వారా ఉచిత కరెంటు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసి నేరుగా రైతులే చెల్లిస్తారని, దీంతో రైతులు తమ విద్యుత్ సేవలను ప్రశ్నించేందుకు వీలవుతుందని సీఎం చెప్పారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. జిల్లాలో 2020–21లో 26,083 కనెక్షన్లకు 101.51 ఎంయూ విద్యుత్ వినియోగించగా, 2021–2022లో 67.76 ఎంయూ విద్యుత్ వినియోగంతో 28,393 కనెక్షన్లకు పెంచి 33.75 ఎంయూ ఆదా చేశామన్నారు.










Next Story