పార్టీ కార్యకర్తల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసే వీలుందని తెలిపారు. రెడ్‌బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేర్కొనవచ్చన్నారు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ ఉంటుందని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని వైఎస్ జగన్ అన్నారు.
వైఎస్సార్‌సీపీలో పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామని హెచ్చరించారు.