పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అలాగే తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కులం, ప్రాంతం, మతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా గౌరవప్రదమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు కోసం పోరాడిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు.