వైసీపీ శాంతి ర్యాలీలు
పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఖండించారు.
By Medi Samrat
పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఖండించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
పహల్గాం ఉగ్రవాద దాడిలో చెందిన ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జె.ఎస్. చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో తెలుగు సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.