న‌న్ను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

By Medi Samrat
Published on : 31 July 2025 4:50 PM IST

న‌న్ను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ నాయకుడు కాకాణి గోవర్దన్‌ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి అభిమానులను అడ్డుకున్నార‌ని వైఎస్ జగన్ మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని, తన పర్యటనను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందని సూపర్‌సిక్స్‌ హామీల గురించి ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారన్నారు. మహిళా నాయకులు రోజా, రజని, ఉప్పాడ హారిక పై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో మద్యం మాఫియాకు చంద్రబాబు డాన్‌ల వ్యవహరిస్తున్నారని తెలిపారు. మద్యం కమీషన్లను పంచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలని జగన్ అన్నారు.

Next Story