పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్ మాత్రమేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దందా పుట్టా మహేష్‌తో మొదలై, పుట్టా మహేష్‌తో ఆగిపోలేదని, ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్. తప్పు చేసిన వారిపట్ల చంద్రబాబు చర్యలు తీసుకోలేదని, అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు.
అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలు వేశారని విమర్శించారు. తప్పు చేసిన వాళ్లపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని, అందుకే దురాగతాలు పెరుగుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, ఇక మిగిలింది కేవలం రెండేళ్లేనని, చివరి ఏడాది ఎన్నికలు జరుగుతాయని జగన్ అన్నారు. ఈ మధ్యలో తాను పాదయాత్ర కూడా చేపడతానని తెలిపారు.