ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని, ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరన్నారు. ఏపీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా తాకట్టు పెట్టారో తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారన్నారు, రాయలసీమ లిప్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారన్నారు.