మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే అతిపెద్ద స్కాం. ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కాం అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు వైఎస్ జగన్ అందించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాల్ని గవర్నర్‌కు వివరించాం. ప్రజలను నిరసనలు సహా ఆధారాలతో గవర్నర్‌కు అందించాం. ప్రభుత్వం బాధ్యతగా ఉండకపోతే ప్రజలు జీవించలేరు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య, విద్యను అందించాలి. వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేస్తే.. ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు వైఎస్ జగన్. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరెలా ఇస్తారు.. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా? దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదని అన్నారు వైఎస్ జగన్.