అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విషవాయువు లీకేజీని సీరియస్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేసి కారణాలను తెలుసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.
మరోవైపు విషవాయువు లీకేజీ అయిన సెజ్‌లోని సీడ్స్ కంపెనీని మంత్రి అమర్‌నాథ్ పరిశీలించి.. ప్రమాదంపై నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా కంపెనీ తెరిచే వరకు కార్మికులకు వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.