సీఎంకు రాఖీ క‌ట్టిన మ‌హిళా నేత‌లు

YCP Women Leaders Ties Rakhi to CM Jagan. రాఖీ పండగ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు.

By Medi Samrat  Published on  22 Aug 2021 4:36 AM GMT
సీఎంకు రాఖీ క‌ట్టిన మ‌హిళా నేత‌లు

రాఖీ పండగ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. శనివారం రాత్రి సీఎం జగన్ ను క‌లిసిన మ‌హిళా నేత‌లు ఒక‌రోజు ముందుగానే.. ఆయ‌న చేతికి రాఖీలు క‌ట్టారు. చిల‌క‌లూరి పేట‌ ఎమ్మెల్యే విడదల రజనీ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి సంతోషిణి సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు.

ఇదిలావుంటే..ర‌క్షా బంధ‌న్‌ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం జగన్‌ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారిత సాధించేందుకు మనందరి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Next Story
Share it