వైఫల్యం ఒక్కటే ఇంచార్జ్, ఎమ్మెల్యేల మార్పుకు కారణం కాదు

వైసీపీలో కొత్త ఇంఛార్జ్ ల నియామక వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By Medi Samrat  Published on  12 Dec 2023 1:26 PM GMT
వైఫల్యం ఒక్కటే ఇంచార్జ్, ఎమ్మెల్యేల మార్పుకు కారణం కాదు

వైసీపీలో కొత్త ఇంఛార్జ్ ల నియామక వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుపై ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తెలంగాణ ఫలితాలకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని తేల్చారు. వైఫల్యం ఒక్కటే ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేల మార్పుకు కారణం కాదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. కొంత మందిపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే.. మార్పులు విషయంలో మొహమాటమే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇద్దరు కలిసి పోటీకి వస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా మార్పులు జరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్పులు చేయాల్సిన చోట ఖచ్చితంగా ఉంటాం.. చెప్పే చేస్తామని అన్నారు. కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించటం కోసం కొన్ని మార్పులు తప్పడం లేదన్నారు.

11 నియోజవర్గాల్లో పార్టీ వ్యవ­హారాలన్నీ కొత్తగా నియమితులైన సమ­న్వయకర్తలే పర్యవేక్షిస్తారని వైసీపీ అధిష్టానం ఇప్పటికే తెలిపింది. వచ్చే ఎన్ని­కల్లో మెరుగైన ఫలితాల కోసమే ఈ మార్పులని, భవిష్యత్తులోనూ ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చని చెబుతోంది వైసీపీ. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని, అందరి సేవలను వినియోగించుకుంటుందని మంత్రి బొత్స ఇప్పటికే స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు మరింతగా మంచి చేయాలంటే పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డేనని మంత్రి బొత్స గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వ­కర్తగా చిరంజీవిని సీఎం జగన్‌ నియమించారన్నారు. పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సముచిత స్థానం ఇస్తారని చెప్పారు. పార్టీ ఏ ఒక్కరినీ వదులు­కోబో­దని, ఎవరి సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు.

Next Story