వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం పార్లమెంటులో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన తోటి ఎంపీలు వెంటనే స్ట్రెచర్ ఎక్కించి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. బీపీ, షుగర్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కళ్లు తిరిగినట్లున్నాయి. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆసుపత్రికి వెళ్లి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆరో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. భారతీయ గాయని లతా మంగేష్కర్‌కు హౌస్ ఆఫ్ కామన్స్ నివాళులర్పించింది లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాటు వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య తర్వాత స్పీకర్ ఓం బిర్లా స్మారక సందేశాన్ని సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో చదివి వినిపించారు.