ఎంపీడీవోకు వైసీపీ నేత వార్నింగ్.. చెప్పినట్లు వినాలని.. లేకపోతే

YCP leader warns MPDO in East godavari. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయకు నల్లచెరువు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తాతాజీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

By అంజి  Published on  7 Dec 2021 12:54 PM IST
ఎంపీడీవోకు వైసీపీ నేత వార్నింగ్.. చెప్పినట్లు వినాలని.. లేకపోతే

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయకు నల్లచెరువు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తాతాజీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జడ్పీటీసీకి ప్రోటోకాల్ పాటించటం లేదని.. తాము చెప్పినట్లు వినకపోతే చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైసీపీ నాయకుడిపై ఎంపీడీవో విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన ఎంపీడీవో విజయ మాట్లాడుతూ.. కే. జగన్నాథపురంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వాలంటీర్లను తప్పించానని తెలిపారు. వాలంటీర్లను తప్పించటతో పాటు జడ్పీటీసీ సభ్యుడికి ప్రోటోకాల్ పాటించలేదని తన మీద ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయారు. తనను హెచ్చరించిన తాతాజీతో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆర్డోవోకి ఎంపీడీవో విజయ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తెలుగు దేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల పట్ల వైసీపీ నేతల మాటలు వింటే... వీళ్ళ కుటుంబాలలో మహిళలు ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది అంటూ టీడీపీ ఫైర్ అయింది.


Next Story