మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోంది: సీఎం చంద్రబాబు
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు.
By - Knakam Karthik |
అమరావతి: మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి, నేను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగాం. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టాం. అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్‌గా మారింది. ప్రతి ఒక్క కిలోమీటరుకు ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కి.మీ. ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కి.మీ. ఒక హైస్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. ఇది విద్యా రంగంలో మా ప్రభుత్వం ముద్ర.
ఇప్పుడు కొంత మంది తయారు అయ్యారు. మెడికల్ కాలేజీలకు వీళ్ళు ఖర్చు చేసింది, కేవలం 5 శాతం నిధులు మాత్రమే. 5% ఖర్చు చేసి మొత్తం కట్టేశాం అని చెప్తున్నారు. గతంలో వాళ్ళు 50% సీట్లు ఫ్రీ పెట్టారు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయి. ఒక పీరియడ్ ఆఫ్ టైం తరువాత, అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది. దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ ఆడుతున్న డ్రామా వివరించిన సీఎం..1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి, నేను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగాం. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టాం. అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్‌గా మారింది. ప్రతి ఒక్క కిలోమీటరుకు ఒక… pic.twitter.com/dTfrkk9XnK
— Telugu Desam Party (@JaiTDP) September 16, 2025