వారికి 2 లక్షల రూపాయలు సాయం అందజేసిన వైసీపీ
సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ సాయం చేసింది.
By Medi Samrat
సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ సాయం చేసింది. వైఎస్సార్‌సీపీ తరఫున బాధితులకు రెండు లక్షల పరిహారం ప్రకటించింది. చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించామని వివరించారు. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
సింహాచలంలో గోడకూలిన ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిషన్ చైర్మన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందించారు. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణతో పాటు, ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.