ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. దీంతో కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం లాంఛనమే!
కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక త్వరలో జరగనుండగా ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు ఎన్ని దారుణాలు చేస్తున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కారణాల వలన ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామని వైసీపీ నేత పేర్ని నాని స్పష్టం చేశారు.