తన భర్త సంసారానికి పనికి రాడని తెలిసి తనకు పెళ్లి చేశారని ఆరోపిస్తూ చందర్లపాడు మండలం ఏటూరు వద్దనున్న కృష్ణా నదిలో బాధితురాలు నిరసన దీక్ష చేపట్టింది. తనకు పెళ్లి అయిన మూడు రాత్రులు భర్త తన వద్దకు రాకుండా ఉండటంతో అత్త మామలకు తెలిపానని.. తమ పరువు పోతుందని బయటకు చెప్పొదంటూ బెదిరింపులకు గురి చేశారంటూ బాధితురాలు వాపోయింది. తనకు విడాకులు కావాలని అడగటం తో గ్రామ పెద్దల సమక్షంలో తనకు రూ.15లక్షలు ఇస్తానని అత్త మామలు ఒప్పుకున్నారని తెలిపింది.
అయితే.. చివరికు డబ్బు ఇవ్వక పోగా.. తమపై కోర్టుకు వెళ్ళి.. తమను ఇబ్బందులకు గురి చేసి.. తమపై పరువు నష్టం దావా వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనమకు న్యాయం జరిగే వరకూ కృష్ణా నదిలో నిరసన చేపడుతామని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి డిమాండ్ చేస్తుంది.